Gå offline med appen Player FM !
'వసంత కాలం' - అనువాద కథ
Manage episode 420182792 series 2811355
మూలం : మికేలి మరి ‘ఇటాలియన్’ లో రాసి, బ్రైన్ రాబర్ట్ మూర్ ఇంగ్లీష్ లోకి అనువదించిన ‘The Black Arrow’
‘ఆ మధ్యాహ్నం, వసంత కాలపు ఆఖరిరోజుల్లో, ఒక అరుదైన సమయాన దుర్గపు బురుజు నుంచి ఘంటారావం మొదలైంది.’
‘ఒక మధ్యాహ్నం, వసంతకాలం ఇంక ముగిసిపోతోందనగా, ఆ అసాధారణ సమయాన కోట బురుజు నుంచి ఘంటానాదం విన్పించింది.’
మా అమ్మమ్మ వాళ్ళింట్లోని లైబ్రరీలో, ఏ పుస్తకం చేతిలోకి తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఒక రోజంతా అలా అలమరల ఎదురుగా నిలుచుండిపోయాను. ప్రతి వేసవి సెలవుల్లో నేను చదివే బుట్టెడు పాత బొమ్మల పుస్తకాలు గత నెలరోజుల్లో చదివేసాను. నేను ఏదో ఒక పుస్తకం చదవడం మొదలుపెట్టాలనే పట్టుదలతో ఆ రోజు నిద్ర లేచాను. నాకు ఊహ తెల్సినప్పటినించీ వెంటాడుతున్న పుస్తకాల పేర్లన్నీ వరుసగా చదువుకుంటూ వెడుతున్నాను – Littleman, what Now? , What Do you think of America?, And How Green was My valley, విచిత్రమైన పేర్లు… కొన్ని జడిపించి అయోమయానికి గురిచేసినవైతే… కొన్ని విపరీతంగా ఆకర్షించినవి. పేర్ల తర్వాత పేర్లు ; ఏది చేతిలోకి తీసుకోవాలో తెలీక బుర్ర గిర్రున తిరిగేస్తోంది. నా జీవితమంతా చదవబోయే పుస్తకం మీద ఆధారపడినట్టు అక్కడే ఊగిసలాడాను. చివరికి నేనాగిపోయింది అలసట వల్లే తప్ప ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చికాదు. ఆఖరికి నా సమస్య మూడు పుస్తకాలకే పరిమితం కావడానికి వాటి పేర్లు కూడా కారణం అయ్యుండొచ్చు. ఎక్కడో మూలన ఉన్నాయి – కాన్రాడ్ రాసిన ‘Arrow of Gold’, రాబర్ట్ లూయీ స్టీవెన్ సన్ రాసిన ‘ The Black Arrow’ కూపర్ రాసిన ‘White Arrow and Other Stories’. వాటి రచయితల గురించి నాకేమీ తెలీదు కానీ నేనైతే పూర్తిగా ఆ రంగుల మాయాజాలంలో పడిపోయాను. – అప్పటికే చాలా సార్లు చదివిన ‘వైట్ ఫాంగ్’ , ‘బ్లాక్ కోర్సయిర్’ లతో అల్లుకుపోయిన నా తీపి జ్ఞాపకాలు ‘యారో అఫ్ గోల్డ్’ ను ముందుగా వెనక్కి తోసాయి. చివరికి ఏదో దుష్టశక్తి నన్నావహించినట్టుగా, చీకటి రంగే గెలిచింది. (కొన్నిపేజీలు ముందుకు వెళ్ళినతర్వాత పుస్తకంలోని ముఖ్యమైన సన్నివేశం, వైట్ రోజ్ ఆఫ్ యార్క్ , రెడ్ రోజ్ అఫ్ లాంకాస్టర్ అనే రెండు పాత్రల మధ్యన అని తెలుసుకుని, మూడు రంగులు కదా అని చాలా సంతోషించాను)
బాగాఅలోచించి ‘The Black Arrow’ ను చేతిలోకి తీసుకున్నాను. ఆ పుస్తకాన్ని నేను ఆతృతగా చేతిలోకి తీసుకుని ఆనందంగా అతి జాగ్రత్తగా చదివాను. మూడురోజుల్లో పూర్తిచేసాను. పుస్తకం సృష్టించిన కాల్పనిక లోకంలో విహరించి వెంటనే బయటకు రాలేక, ఆ అద్భుత ప్రపంచపు జ్ఞాపకాలు పూర్తిగా వీడక, రోజూవారీ జీవితంలోని సామాన్య పరిస్థితులతో సమాధానపడలేక, నేను తికమకపడుతూంటే అకస్మాత్తుగా మా తాతయ్య మరుసటి రోజు సాయంకాలం ఏడు గంటలకు మా నాన్న వస్తున్నారన్న కబురందించారు.
ఇప్పుడు ఈ కథలో విషాదం అర్థం కావాలంటే మా నాన్న భీకర స్వరూపం నాకెదురైనప్పుడు – ఒళ్ళు గగుర్పొడిచే భయాందోళనలు, వ్యక్తీకరించలేని ప్రేమానుభూతులు, ఎందుకో తెలీని వ్యతిరేకత, అపరాధ భావం, మనసు విప్పి మాట్లాడాలనే అమితమైన కోరిక, అయోమయం, మా నాన్నతో కలిసివున్నట్టు నాకొచ్చే కలలు, చివరికి ఏళ్ళ తరబడి అలవాటైన దూరం వల్ల నన్ను చుట్టేసే నిశ్శబ్దపు సంకెళ్ళు – వీటి మధ్య నేను ఉక్కిరిబిక్కిరి అవుతానని మీరు తెలుసుకోవాలి. అత్తగారింటి వాళ్ళను పూర్తి పరాయి మనుషులుగా నాన్న భావిస్తారని, వాళ్ళ ఇంటికొచ్చి నాతో ఏనాడూ ఒక పూట కూడా గడపలేదన్న విషయాలు తెలిసిన వాళ్ళకి, ఆయన వస్తున్నాడన్న సమాచారం నాలో అలివికాని సంతోషంతో పాటు అపరాధభావాన్ని ఎందుకు కలిగించిందో అర్థం అవుతుంది. ఆయన ప్రశాంత వదనం ఓ పక్క పరిస్థితిని ఉధృతం చేస్తూంటే అంతటితో సరిపోనట్టు ఆయన అకస్మాత్తుగా నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చానని చెప్పినప్పుడు ఏవనాలో తెలీలేదు. గుండెబరువై దిక్కుతోచలేదు: ఆయన వాత్సల్య ప్రదర్శన నన్నింకా ఇబ్బంది పెట్టింది. మా నాన్న సూటుకేసు తెరుస్తూంటే నోటమాట రాక నేనక్కడే నిలుచుండి పోయాను. ఆయనకు తిరిగి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తూ, నా దగ్గరుండే పనికిమాలిన వస్తువుల చిట్టానంతా ఒకసారి బుర్రలో తిరగేసుకున్నాను; మాగ్నోలియా మొక్క, గ్లాసుడు గులకరాళ్లు, కొత్తచొక్కాతో వచ్చిన అట్టపెట్టె … ఈ బీద పదార్థాలన్నిటికీ వెల కట్టలేని విలువనాపాదించి, మా మధ్య వున్న అరమరికలను శాశ్వతంగా దూరం చేసే ప్రతీకలుగా వాటిని భావించి, ఒక్కసారిగా మా మధ్య అన్ని అపార్థాలు సమసిపోయిన అనుభూతిని పొందాను.
పడుకునే ముందర ఆ బహుమతిని ఆయన నా చేతికిచ్చాడు. అదో పుస్తకం. పేరు చూడగానే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా రాబోయే ఇబ్బంది పసిగట్టాను. నమ్మశక్యంగా లేకపోయినా, అది నాలుగు రోజులక్రింద నేను ఆస్వాదిస్తూ చదివిన ‘ Black Arrow’ నవల. ‘దారుణం!’ – అదే నాకు తట్టిన మొదటి పదం; ఘోరం, బాధాకరం కూడా. ఆలోచిస్తూంటే నాకనిపించింది – ‘దీనికి దురదృష్టమో మా నాన్నో కారణం కాదు… ఇదంతా నా వల్లే జరిగింది.’ ( నాన్న ఆ పుస్తకాన్ని వస్తూ వస్తూ నార్తర్న్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీదే కొన్నాడన్న విషయం గుట్టుగా తెలుసుకున్న తర్వాత కూడా నా స్థితి మెరుగుపడలేదు; అప్పటికే నా మనసులో ‘బహుమతి’ అన్న పదం తన అర్థాన్ని విస్తరించుకుని చెరిగిపోని చేదు గుర్తుగా ముద్రించుకుపోయింది.)
అదీ పరిస్థితి. క్రిస్మస్కో నా పుట్టినరోజుకో సంబంధం లేకుండా, తన ప్రేమను వ్యక్తం చేయడానికి మా నాన్న బాహాటంగా ఇలాటి పనికి పూనుకోవడం ఎంత అసాధారణంగా ఉందంటే అది నన్ను తట్టుకోలేని ఇబ్బందికి గురిచేసింది; బహుమతి వల్ల వచ్చిన అసౌకర్యంతో పాటూ ఇంకో ఆలోచన కూడా మొదలైంది. నాకిచ్చిన పుస్తకానికి ఒక ఖరీదు అంటూ ఉండటం ( నా మీద ఒకరు డబ్బులు ఖర్చు చేయడం నన్ను ఎంతో సిగ్గుపడేలా చేస్తోంది.) నాకు సంతోషం కలిగించాలనీ, అందులోనున్న మానవతా విలువలు నాకు ఒంటపట్టాలని, ఇదికాక మా నాన్న పుస్తకాల షాపులో (వాడికి నచ్చుతుందా, వాడిలాటి పుస్తకాలేనా చదివేది?) నా కోసం… కేవలం నాకోసం కొంత సమయం ఖర్చుచేయడాన్ని ఊహించుకుంటే నాకు విచిత్రంగా ఉంది. ఇది ఎవ్వరి ఊహకూ అందనంత సంతోషాన్నిచ్చే విషయమే కానీ, ముందే ఆ పుస్తకాన్ని చదివేసి ఆ ఆనందాన్ని దూరంచేసుకున్నానని అర్థం అయ్యాక, ‘మరో సారి చదువుదాంలే!’ అన్న ఆలోచన వచ్చినా ‘ఎన్ని మార్లు చదివినా, మరిన్ని రోజులాగి చదివినా, అది నాలో పుట్టే బలమైన కోరిక వల్ల జరగాలి తప్ప, ఏవీ జరగనట్టుగా అదే పుస్తకం తీసి చదవడం, పుస్తకాన్నీ, ఇచ్చిన వ్యక్తినీ మోసగించడమే అవుతుంది’ అనుకుంటూ ఆగిపోయాను. నా మీదున్న ప్రేమను ముద్రించిన అక్షరాల ద్వారా మీరందించారు కానీ ఆ అక్షరాలను అంతకు ముందే మీకు తెలీకుండా స్పృశించాను. తెలీక నేను చేసిన తప్పు మీ ప్రేమకు నన్ను దూరం చేసింది. పుస్తకం చేతికందిస్తున్నప్పుడు దాంతోపాటు చూసిన ఆయన చూపు, ఆ తీయనైన చూపులో నిద్రాణమై దాగి వున్న సంతృప్తిని నేను అనుభవించాను. ఆ చూపు ఒక్కటే చాలు నన్ను కాల్చి వెయ్యడానికి. చేసిన తప్పుతో పాటూ ఆ తర్వాత నా మౌనం ఆ అనుభవాన్ని మరింత చేదు చేసింది. నోరు తెరవకుండా నోటికి శాశ్వతంగా తాళం పడేలా శిక్షను విధించుకున్నాను. లేని ఉత్సాహం చూపిస్తూ కృతజ్ఞతలు తెలిపి, అంతటితో ఆగకుండా తొందరగా చదవాలన్నట్టుగా నటించాను కదా! ఎప్పటికైనా ఆయనకు నిజం చెప్పేంత ధైర్యం ఎక్కణ్ణించోస్తుంది? ఆయన బహుమతి ఇచ్చిన ఆ భయంకర ఘడియ మొదలు, నేను గడిపిన ప్రతి క్షణం నా అబద్ధపు ప్రపంచాన్ని విస్తరిస్తోంది; అదే రోజు రాత్రి బెడ్ లైటు వెలుగులో చదవడానికి, మా నాన్న ‘యూనివర్సాలి సైన్టిఫికా బోరింగెయిరి’ చేతపడితే నేను నా శాపగ్రస్త నవలను తీసుకుని కళ్ళను అక్షరాల వెనక పరుగు పెట్టిస్తున్నట్టు నటిస్తూ ఉండగా – ‘మా అనుబంధాన్ని సరిచేసుకోవడం అసాధ్యం’ అన్న వాస్తవం స్పష్టంగా కళ్ళెదుట నిలిచింది. ఆ భయానక రాత్రి గడుస్తున్న కొద్దీ ఎదురుగా కనపడుతోన్న అక్షరాల ముద్రలు క్రమంగా వాటి రూపాన్ని కోల్పోతున్నా, కారవాగ్గియో గీచిన ఛాయాచిత్రంలా కన్పడుతోన్న మా నాన్న నీడ వైపు చూడాల్సొస్తుందన్న భయంతో తల పైకెత్తలేకపోతున్నాను. వేదనను, అపరాధభావననూ శక్తి మేరకు అనుభవిస్తూ ఒక్కో పేజీ చదివి తిప్పడానికి సరిగ్గా ఎంత సమయం అవసరంవుతుందో లెక్కకట్టి పక్క పేజీకి వెడుతున్నాను. సరిగ్గా లైటు ఆపబోయే సమయంలో మా నాన్న ‘ అయితే నీకు ఈ పుస్తకం నచ్చినట్టేనా?” అని ప్రశ్నించినప్పుడు ఊరికే ‘నచ్చింది’ అని చెప్పాలో, ‘ చాలా నచ్చింది’ అని చెప్పాలో, అసలేది చెప్తే నేను అబద్ధాన్ని తక్కువ చేయగలనో అర్థం కాక చివరికి ఊ !” అని నీలిగి – తడబడుతూఇచ్చిన సమాధానం వల్ల నాన్నకు ఎక్కడ అనుమానం వస్తుందో, ఎక్కడ ఆయన వీడికి ఈ పుస్తకం నచ్చక మొహమాటపడుతున్నాడని భావిస్తాడో అని అనుకుంటూ నరక యాతన పడడం నాకు గుర్తుంది.
ఆ తర్వాతి రోజుల్లో అదే పుస్తకం కొత్త కాపీ మళ్ళీ చదువుతున్నానని తాతయ్య మా నాన్న ముందు తొందరపడి అనేస్తాడేమో అన్న అనుమానంతో ఆయన కళ్ళపడకుండా జాగ్రత్త పడాలన్న ఆందోళనతో ఆ బాగోతాన్ని అలాగే సాగించాను. ‘కొత్త కాపీ ’… మా నాన్న వెళ్ళి పోయిన కొన్ని రోజులు గడిచినతర్వాత కానీ నా విముక్తికి ఆ పదం బీజం వేస్తుందన్న ఆలోచన నాకు రాకుండా క్రూరమైన విధి నాకు అడ్డుపడింది. ద్రాక్ష పందిరి క్రింద నిల్చుని భయానకమైన అసంతృప్తితో నాన్నకు వీడుకోలు పలికేటప్పుడు, ప్రతిసారీ నాకిష్టమైన వ్యక్తి వదిలి వెడుతున్నప్పటి లాగానే, ఆ మనిషి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నట్టు, ఇంక చెయ్యగలిగింది ఏమీ లేనట్టు, ఏదైనా చేయడానికి అసలు సమయం మించిపోయినట్టు, బయటకి చెప్పని మాటలు శాశ్వతంగా నాలోనే మిగిలిపోతాయన్నట్టు అనిపించడం నాకింకా గురుతుంది. ఎంతో కాలం నించీ పరిచయం వున్న ప్రదేశాలన్నీ ఆయన ప్రతిబింబంతో నిండిపోయి ఆయన దూరం అయిన కొన్నిరోజుల్లోనే ఆ ప్రతిబింబం నీడలా మారిపోయి ఆ ప్రదేశాలనంతా ఆవరించి అచేతనంగా, అసంపూర్తిగా మార్చింది. ఇంత జరుగుతున్నా ఒక ఆలోచన మటుకు నన్ను వదిలిపెట్టడం లేదు, ప్రపంచంలో అన్ని రకాల పుస్తకాలుంటే …. నాకున్న ఆతృతకొద్దీ పుస్తకాల అలమరా దగ్గరికి పరిగెత్తాను ; ఉత్తమస్థాయి లైబ్రరీ నా ముందు లేకపోయినా,లోకంలో వున్న అన్ని పుస్తకాల సంఖ్యతో బేరీజు వేస్తె ఆ అలమర్లలో వుండే పుస్తకాల శాతం అతితక్కువైనా, తాతయ్య దగ్గరుండే లైబ్రరీ పెద్దదే. ఊపిరి బిగపట్టుకుని పుస్తకాలను లెక్కపెట్టాను. ఒక అలమరలో వున్న పుస్తకాలను లెక్కపెట్టి అక్కడున్న అలమరల సంఖ్యతో హెచ్చవేస్తే వేస్తే దాదాపుగా ‘వెయ్యి’ లెక్క తేలింది. అంటే నన్ను నవ్వులపాలు చేసి నన్ను ఈ దురదృష్టపు స్థితికి నెట్టివేయడానికి ఉన్న అవకాశం వెయ్యిలో ఒకటి. కాదు కాదు – పక్కనే బల్ల మీద బయట పెట్టిన పుస్తకాలు ఇంకో యాభై వున్నాయి. ఈ రెండిటినీ హెచ్చవేస్తే, యాభై వేలల్లో ఒకటి – ఊహూ మనం లెక్కల జోలికి వెళ్ళడం అంత గొప్ప ఆలోచన కాదు; యాభయి వేలంటే … ఇన్ఫినిటీ ని ఊహించడంకంటే కష్టంగా ఉంది…
ఆ నిస్సహాయత వల్లనే కాబోలు అకస్మాత్తుగా ఒక జ్ఞానదీపం వెలిగి పైకి సరళంగా కనపడే ఆ సంక్లిష్టమైన పదం నాకు స్ఫురించింది – ‘వేరే ఎడిషన్’. వెంటనే నన్ను చుట్టుముట్టిన విరక్తిని అధిగమించి, నేను ఇంతకు ముందు చదివిన ‘బ్లాక్ ఆరో’ ను తీస్కొని కింది అంతస్థులో వున్న నా గదికి చేరుకున్నాను. పక్కనే బల్ల మీద మా నాన్న ఇచ్చిన కొత్త కాపీ వుంది. రెండిట్నీ ఒక దగ్గరకు తెచ్చి జాగ్రత్తగా పరీక్షించాను. రెండూ ఒకే మాదిరిగా వున్నాయి. అయితే ఒక పుస్తకం కవరు మామూలుగా ఉంటే, రెండో దాని కవరు మెరుస్తోంది. దానిమీద ఒక రంగుల బొమ్మ… రెండు గుర్రాలతో ఒక బగ్గీ; ఏదో సినిమా పోస్టర్ లా వుంది.
మొదటి పుస్తకం లోపల ఇలా రాసుందని నాకు ఇప్పటికీ గుర్తుంది. ‘మిలాన్ మదెల్లా 1924’
రెండో పుస్తకం తెరిస్తే మాసిపోయిన చిన్న చిన్న అక్షరాల్లో ‘1965 – డెల్ అల్బెరో ఎడిషన్ – ట్యూరిన్’ అని రాసుంది.. అదే పేజీలో కింద అర్థం పర్థం లేకుండా ‘’ఎడిటింగ్ – అల్బెర్టో మిత్తోనే’ అని కనపడింది.
ఆ వయసులో నాకు ‘ఎడిటింగ్’ అంటే ఎలా తెలుస్తుంది. కానీ ఆ వివరం కొట్టిపారేసేదేవీ కాదు అని నాకనిపించింది. ఈ రెండు పుస్తకాలు నిజంగా వేరే వేరే ఎడిషన్లకు చెందినవైతే, చాలా తేడాలు ఉండాలేమో కదా. మొదటి పుస్తకంలోకి మళ్ళీ వెళ్ళి చూస్తే; ‘అనువాదం – గిగ్లియోలా ఒలివేరో’’ అనిరాసుంది.
‘అనువాదం’ అనే పదం నన్ను అక్కడికక్కడ ఆపి ఆలోచనలో పడేసింది. ‘స్టీవెన్సన్’ ఇటాలియన్ పేరు మటుకు కాదు, కాబట్టి నవల వేరే ఏదో భాషలో రాసుంటారు. అంటే నేను చదివింది… నా ఒళ్ళంతా పులకరించిపోయింది. కొండంత ఆశతో పుస్తకాలు రెండూ ఒకటికాదని ఎలాగోలా నన్ను నేను భ్రమింపచేసుకోవాలని తీవ్రంగా పైపై తేడాలకోసం వెతుకుతూ ఉంటే, ఈ పుస్తకాలనీ పూర్తిగా వేరు చేసి దూరం పెంచగల మంత్రం స్ఫురించింది; ఈ రెండూ ఒకటే కాదు అని చెప్పడానికి, వీటిల్లో వేరుగా రాయబడ్డ ఒక్క పదం దొరికినా చాలు. అప్పుడు ముల్లోకాలు కల్సి నన్ను పెడుతున్న ఈ ముప్పుతిప్పల నుంచి బయటపడడానికి నేను నాన్న ఇచ్చిన పుస్తకాన్ని, ఒక కొత్త పుస్తకంలా అంతా చదువుతాను.
మా నాన్న ఇచ్చిన పుస్తకంలో ఎవరు అనువదించిందీ రాసిలేదు – అంటే పుస్తకం సవరించిన మిత్తోనే కానీ ఆయనతో పని చేసిన ఇంకెవరైనా కానీ అనువదించి ఉండాలి. ఎవరైతేనేం! ఆ వ్యక్తి పట్ల అంతుతెలీని కృతజ్ఞతా భావంతో నా హృదయం నిండిపోయింది. కానీ అలా కాకుండా ఒలివేరో చేసిన అనువాదమే మళ్ళీ ప్రచురింపబడి ఉంటే? ఈ ఊహ రాగానే ఒళ్ళంతా చల్లబడి పోయింది. పుస్తకం వైపు చూడ్డానికి కూడా ధైర్యం కోల్పోయి, వెంటనే గది వదిలి వెళ్ళిపోయాను. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కొచ్చాను. ఒక పిచ్చి సంకల్పంతో, మంచంమీద గోడకానుకుని కూర్చుని, రెండు పుస్తకాలనూ ఒళ్ళో పెట్టుకున్నాను, మాదెల్లా ఎడమ వైపు, డెల్ అల్బెరో కుడి వైపు. ఊపిరి ఆడడం లేదు. ఒకే సారి రెండిట్లో ఐదో పేజీ తెరిచాను; నిరాశాజనకంగా రెండిట్లోనూ సరిగ్గా ఐదో పేజీలోనే కథ మొదలయ్యింది. ఇప్పుడు తేలిపోతుంది. ఎడమవైపు ‘ఆ మధ్యాహ్నాన ‘ అని కుడివైపు ‘ ఒక మధ్యాహ్నాన ‘ అని చదివాను. ఇంకేం పర్లేదు. ‘ఒక మధ్యాహ్నం’, ‘ఆ మధ్యాహ్నం’ రెండూ ఒకటే కాదు. ఆ మధ్యాహ్నం అంటే, ఆ మధ్యాహ్నానికి ఒక ప్రత్యేకతను ఆపాదించడం. కానీ ఒక మధ్యాహ్నం అంటే… అది మధ్యాహ్నం పూట మాత్రమే – ‘రాత్రో, పొద్దునో కాదు’ అని చెప్పడం. ఈ రెండు పుస్తకాల్లో మా నాన్న ఇచ్చిన పుస్తకం మొదటి వాక్యంలోనే తేడా చూపించడం మొదలుపెట్టింది. ‘ఒక వసంతకాలం ఆఖరి రోజుల్లో’ అంటే ఎన్నో వచ్చి పోయిన వసంతాలలో ఒక వసంతం ముగుస్తూండగా అని – ఇక్కడ గడిచిపోయిన సమయం గురించి రచయిత చెప్తున్నట్టు. వసంతకాలం ముగుస్తూండగా అంటే, నాలుగు ఋతువుల్లో ఒక ఋతువైన వసంత ఋతువులో అని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నట్టు. ఒకచోట ‘కాలం’ గురించి మాట్లాడుతుంటే ఇంకో చోట ‘ ప్రకృతి ’ గురించి చెప్పినట్టు. ఇది తట్టగానే, నాకెంత ఆనందం కలిగిందంటే, పిచ్చోడిలా రెండు పుస్తకాలనూ , ఒక సారటూ ఒక సారిటూ తలను తిప్పుతూ కాలం – ప్రకృతి , కాలం – ప్రకృతి అని బయటికి పదే పదే అనడం మొదలుపెట్టాను. అవును – ఈ రెండూ, అనువాదకులు సృష్టించిన రెండు వేర్వేరు ప్రపంచాలు. ఇంకా చెప్పాలంటే ఎడమ వైపు ‘వసంతం ఆఖరి రోజులు’ అనడం- ఒక వేదనను సూచిస్తూంటే , కుడివైపు వున్న పుస్తకం ఏదో వివరం ఇచ్చినట్టు ‘వసంతం ఇంక ముగుస్తోంది’ అంటోంది. అసలు ఈ రుతువులు అంతాలు ఈ గోలంతా అవసరమా, నేనేవన్నా నిజంగా పట్టించుకోవాల్సిన విషయాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నానా! అన్న అనుమానం వచ్చింది. వెంటనే నేను అక్కడితో ఆగి కొంత ఆలోచించాను. దాని వల్ల నాకర్థం అయ్యింది ఏమిటంటే నేనింకా లోతుల్లోకి వెళ్లి యాతన భరించడం తప్పదని. ‘ఆఖరు’ అన్న పదం వాడడాన్ని ఏదో ఇబ్బందినీ బాధను సూచిస్తున్నట్టుగా, చివరి రోజులు అనడంలో, విషయం ముగింపుకు వచ్చినట్టుగా, లేదా పూర్ణత్వం సంతరించే అర్థంలో వాడినట్టుగా అనిపించింది నాకు: మొదటి పుస్తకంలో కథంతా విషాదంతో కలగలసి ఉన్నట్టు, రెండో కథలో సాహసయాత్ర గురించి రాసినట్టు తోచింది. ఇంకా ముందుకు వెళ్తే – అటువైపు పాత్రలన్నీ గంభీరంగా, అంతర్ముఖులుగా ఉన్నట్టు, (నిజానికి మొదటి పుస్తకం చదివినప్పుడు అలాటి భావన కలిగినట్టు నాకు గుర్తు లేదు), ఇటు వైపు పాత్రలన్నీ ఉల్లాస భరితమైన యోధులతో నిండున్నట్టు. నా ఆలోచనలు పాత్రలతో ఆగకుండా, అనువాదకులపైకి గూడా పాకాయి. ఒలివేరో ఒక బక్కపలచటి, దయాళువైన మనిషిలా , అల్బెర్టో మిత్తోని ఒక ఉడుకు రక్తం కలిగిన, ఉద్రేకమైన వ్యక్తిలా (సీసాలోంచి పెద్ద గ్లాసు లోకి వంచుకుని మద్యం తాగుతూ , అనువాదం చేస్తూ, అప్పుడప్పుడూ పాత్రలను తిట్టేస్తూ, బల్ల మీద పిడికిలితో గుద్దుతూ… ) ఉంటారనిపించింది.
కానీ ఈ దయగల మహా తల్లి ఒలివేరో ‘దుర్గం’ లాంటి పదం కూడా వాడిందే.
‘ఆ మధ్యాహ్నం, వసంత కాలపు ఆఖరిరోజుల్లో, ఒక అరుదైన సమయాన దుర్గపు బురుజు మీదినుంచి ఘంటారావం మొదలైంది.’
మిత్తోనే వాడిన ‘కోట’ అన్న పదం కంటే దుర్గం అన్న ఈ పదం కచ్చితంగా యుద్ధవాతావరణాన్ని సూచిస్తోంది.

కోట అంటే యుద్ధాలు మాత్రమే కాదు , మల్లయుద్ధ పోటీలు, నృత్యాలు, విందులు జరిగే స్థలం కూడా. దుర్గం అనగానే, దాంట్లో ఆయుధాగారాలుండి, ఎత్తైన బురుజుల చుట్టూ ఫిరంగుల మోహరించినట్టు భావన కలిగితే, కోట అంటే విశాలంగా లోపల అనేక సభాభవనాలు, ఉద్యానవనాలతో ఉంటుంది. (మిలాన్లోని స్ఫోర్జా కోటలో ఉన్నట్టు); ఒకటేమో ఎవరికీ అందని పర్వతపు శిఖరం మీద, రెండోది మైదానంలో. దుర్గం చిక్కని నలుపు రంగులో ఉంటే , కోట ఎర్రమట్టి రంగులో ఉన్నట్టు… అలా విజయవంతమైన విశ్లేషణతో వచ్చిన ఆత్మ విశ్వాసంతో ఇంకా ముందుకెళ్ళి అవే పదాలను పిప్పి పిప్పి చేసే అవకాశమున్నాకూడా, అక్కడితో ఆపి ముందుకెళ్ళాను:

1924 లో వచ్చిన పుస్తకం ప్రకారం గంటలు అలానే ఆగకుండా మోగుతూ ఉంటే, 1965 లో వచ్చిన పుస్తకం ప్రకారం గంట ఒక్కసారే మోగింది. ఒకటేమో గణగణమంటూ ఆందోళనతో మోగించినట్టుంటే, రెండోది నిమ్మళంగా, సాధికారంగా. మొదటి వ్యక్తి దుస్థితిలో ఉన్న సన్యాసి అయితే, రెండో వ్యక్తి బలాఢ్యుడైన సైనికుడిలా. దిక్కుతెలియని ఆశ్రమవాసి సహాయం కోసం చేసిన ఆక్రందన ఒకటయితే, రెండోది శిక్ష అమలుచేసే ముందు వేసే దండోరాలా. అసలు ‘ఘంటారావం మొదలైంది’ అంటే గంటలు కొడుతూ పోయారని కాకుండా, గంటల శబ్దం చుట్టూ వున్న ఖాళీ స్థలంలో ప్రతిధ్వనించి ఉండొచ్చు. శబ్దం మీద రచయిత దృష్టి పెట్ట కుండా, ఆ శబ్దం శ్రోత మీద సృష్టించిన అనుభూతి గురించి చెప్పాలని ఆ పదం వాడి ఉండొచ్చు. అయినా నిజం చెప్పాలంటే, ఈ ఘంటానాదం అనే పదప్రయోగం కొంచెం నాటకీయంగానే వుంది. ఏది ఎటున్నా, రెండు అనువాదాల్లోనూ, ఈ వాక్యం కొంత మార్మికతను సూచిస్తూ ఆగిపోయింది.

.
ఈ అరుదైన సమయం / అసాధారణ సమయం పదాలు – ‘మామూలు సమయం కాదు’ అనే అర్థంలో కాకుండా వేరేలా వాడారేమో అని గమనిస్తే, ‘అరుదైన’ అన్న విశేషణం అందంగా, కుదురైన పదంలా అనిపిస్తే, ‘అసాధారణం’ అన్న పదం ఏదో అద్భుతం లోక పదజాలంలా,ఏ ఇరవైఐదో గంటలోకో తీసుకెళ్తున్నట్టు.
కానీ ఈ పోల్చిచూడడంలో ఉద్దేశ్యం, పాత అనువాదం కంటే కొత్త అనువాదం బాగుంది అని నిర్థారించుకోవడానికి కాదు, ( మొదటి వాక్యాన్ని తరిచి చూసిన తర్వాత అసలు అలా చెప్పడం నావల్ల సాధ్యం కాదు కూడా) – వాటిల్లో వున్న తేడా, అంతరార్థం తెలుసుకుని రెండో పుస్తకాన్ని మొత్తం కొత్త పుస్తకంలాగా, అసలు అదే మాతృక లాగా భావించి చదువుకోగలగాలి. ఈ రకంగా చదివితే మాత్రమే నాన్న బహుమతికి నేను పూర్తి సార్థకతను చేకూర్చినట్టు; పుస్తకాన్ని నిస్పాక్షికంగా, సంపూర్తిగా చదివి నేను నా కోరిక తీర్చుకోగలను. నేను గమనించిన తేడా అంతా బుర్ర ఉపయోగించి శ్రమించినందుకు నేను పొందిన బహుమతి. అదే విషయం పూర్తిగా నిర్థారించుకోవడానికి ఆ రోజు పొద్దునంతా కేటాయించి, మొదటి పేజీ అంతా విశ్లేషిస్తూ కూలంకషంగా చదివాను: దాని తర్వాత ఏమాత్రం ఆగకుండా, మాదెల్లా పుస్తకాన్ని అలమరాలో వెనక్కి పెట్టేసి, నాన్న తెచ్చిన డెల్ అల్బెరో పుస్తకం చేతిలోకి తీసుకున్నాను. పుస్తకం ముందేసుకుని మొట్టమొదటి సారి చదువుతున్నట్టుగా, మున్ముందు ఎదురవబోయే విశేషణాలు, క్రియావిశేషణాలు, సమాసాలు వీటన్నిటి గురించి ఊహిస్తూ ఆసక్తిగా చదివాను. చదువుతున్నన్ని రోజులూ, దేశ పర్యటనకు వెళ్ళిన యువరాజు ప్రతిరోజూ వార్తాహరుల ద్వారా రాజుగారికి జాబురాసి పంపించిన చందాన, నేను నాన్నకు ప్రతిపూటా ఏదో ఒక ఆత్మీయ సందేశం పంపిస్తున్నట్టుగా అనిపించింది. ఇంకొన్ని పేజీలలో పుస్తకం పూర్తవుతుంది అనగా, నాన్నకు ఏదో ఒక మిషతో ఫోన్ చేసి ‘పుస్తకం ఇంకా ఇంకా నచ్చిందని, మొదటిసారే సరిగ్గా కృతజ్ఞతలు చెప్పి ఉండాల్సిందని, పుస్తకం మొదటి పేరాలో వున్న ఇరవై ఐదో గంట గురించి, ఘంటానాదం గురించి చెబుతూ ఆయన ఈ పుస్తకాన్ని చదివాడా?, నచ్చే నాకు కొన్నాడా? లాంటి సందేహాలన్నీ తీర్చుకోవాలని అనుకున్నాను.
కానీ అదంతా నాలోనే దాచుకున్నాను.
——-
‘ఒక రోజు మధ్యాహ్నం, వసంతకాలపు అంతిమ ఘడియల్లో, వేళ కాని వేళలో బురుజు మీది గంట శబ్దం వినిపించింది.’
Author – Michele Mari ( From the Short story Compilation – ‘You Bleeding Childhood’)
Italian to English Translation by Brian Robert Moore
* Thank you, Einaudi Press, Michele Mari and Brian Robert Moore.
* For your Valuable feedback on this Episode - Please click the link below.
https://tinyurl.com/4zbdhrwr
Harshaneeyam on Spotify App...
500 episoder

Усі епізоди
×Välkommen till Player FM
Player FM scannar webben för högkvalitativa podcasts för dig att njuta av nu direkt. Den är den bästa podcast-appen och den fungerar med Android, Iphone och webben. Bli medlem för att synka prenumerationer mellan enheter.